Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ భగవో, ఆంధ్రాకో బచావో.. ఆదివారం రోడ్లపై కూర్చోండి ప్లీజ్!: శివాజీ

Advertiesment
I Will Fight for Andhra Pradesh Special Status
, శుక్రవారం, 6 మే 2016 (20:12 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఒత్తిడి తేవాలని ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు, నటుడు శివాజీ తెలిపారు. ఏపీ ప్రజలను బీజేపీ సర్కారు మోసం చేయకూడదన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మోడీ సర్కారు గుర్తుంచుకోవాలని శివాజీ సూచించారు. 
 
విజయవాడలో కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ భగావో, ఆంధ్రాకో బచావో అంటూ నినాదాలు లేవనెత్తారు. శివాజీతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఏపీ మొత్తం ఆదివారం ఒక్కరోజు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎలా సాకారమైందో గుర్తుంచుకుని.. ఏపీ ప్రజలు సైతం హోదా కోసం పోరాటం చేయాలన్నారు. ఒకప్పుడు రెండు సీట్లు కూడా లేని బీజేపీకి దేశాన్ని పాలించే అధికారం ఇస్తే మోసం చేస్తారా అని శివాజీ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీ నుంచి అనంతపురంలో నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో వివాదంలో సాక్షి మహారాజ్ : ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని..?!