Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంద్యాల ఉప ఎన్నికపై చంద్రబాబును లెక్క చేయని అఖిలప్రియ, శిల్పా: ఇదేనా సీమ పట్టుదల?

నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేసిన మరుక్షణం ఆ నియోజకవర్గంలోంచే తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెగేసి చెప్పారు.

నంద్యాల ఉప ఎన్నికపై చంద్రబాబును లెక్క చేయని అఖిలప్రియ, శిల్పా:  ఇదేనా సీమ పట్టుదల?
హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (07:40 IST)
రెండు మదగజాలు నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునే ధిక్కరించడానికి సిద్దమయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేసిన మరుక్షణం ఆ నియోజకవర్గంలోంచే తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెగేసి చెప్పారు. ఒకవేళ సీటు రాకపోతే క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకుంటానని ఇరుపక్షాలూ తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఇద్దరికీ  సర్దిచెప్పలేక తంటాలు పడుతున్నారని వినికిడి. 
 
సీనియర్‌ని అయినా సరే తనను పక్కన పెట్టి జిల్లాలో తన ప్రత్యర్థి భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినా తానెలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబుకు చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి సీఎంని కలిసిన శిల్పా సోదరులు నంద్యాల సీటుపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు శిల్పా సోదరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని సూచించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసన మండలి ఛైర్మన్‌ పదవి ఇస్తున్నాం కాబట్టి సహకరించాలని కోరారు. కానీ తన సోదరుడికి మండలి ఛైర్మన్‌ ఇచ్చినా తన సీటు తనకివ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించినా మోహన్‌రెడ్డి వినిపించుకోకపోవడంతో... ఒకటి, రెండు రోజులు ఆగాక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. 
 
నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ  ఏకపక్షంగా ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం ఉప ఎన్నిక గురించి ఇంతవరకు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ ఒక్క మాట కూడా చెప్పకముందే అఖిలప్రియ ఈ విషయాన్ని వెల్లడించడం నేతలను విస్మయపరిచింది. సీటు విషయమై శిల్పా సోదరులను మంత్రి అచ్చెన్నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా, ఇంతలోనే భూమా కుటుంబం నుంచి ఇలాంటి విషయం రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాతికేళ్లు సా........గిన బాబీ మసీదు ధ్వంసం కేసు.. వదలని సుప్రీం.. అద్వానీ షాక్