Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖురాన్‌ మొత్తం ఆధ్యయనం చేశా: బ్రహ్మనందం

Advertiesment
ఖురాన్‌ మొత్తం ఆధ్యయనం చేశా: బ్రహ్మనందం
, శనివారం, 4 జులై 2020 (09:35 IST)
లాక్ డౌన్ సమయంలో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ మొత్తం చదివానని హాస్యనటుడు బ్రహ్మనందం  తెలిపారు. ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

"లాక్‌డౌన్‌ సమయంలో ఖురాన్‌ మొత్తం ఆధ్యయనం చేశా. ఆ పవిత్ర గ్రంధంలో ఏముంది? వాళ్ల మత సూక్తులు ఏమిటి? మహమ్మద్‌ ప్రవక్త ఏం చెప్పాడు?.. ఇవన్నీ తెలుసుకున్నాను. ఆరవ తరగతి చదువుతున్న రోజులనుంచీ నాతో కలసి చదువుకొన్న ముస్లిమ్‌ మిత్రుడు ద్వారా ఇదంతా తెలుసుకొన్నాను.

బైబిల్‌  లోని ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌, న్యూ టెస్ట్‌మెంట్‌ గురించి తెలుసుకొన్నాను. అలాగే బొమ్మలు వేయడం నాకు ఇష్టం కనుక ఈ తీరిక సమయాన్ని మంచి బొమ్మలు వేయడానికి ఉపయోగిస్తున్నా. నండూరి రామ్మోహనరావుగారి ‘విశ్వదర్శనం’ సహా చక్కని పున్తకాలు చదివా" అని చెప్పారు. 

"మా ఇంటి మొత్తానికి మా మనవడు పార్థ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతున్నాడు. వాడి అల్లరితో నాకు టైమ్‌ తెలియడం లేదు’’ అని అన్నారు బ్రహ్మానందం. ఓ టీవీ సీరియల్‌లో నటించబోతున్నారనీ, కామెడీ షోలు చేయడానికి కూడా అంగీకరించారనీ వస్తున్న వార్తల్ని బ్రహ్మానందం ఖండించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 91 కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు ఉచితం