Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక దాడి పేరు చెబితే పోలీసులు సత్వరం స్పందిస్తారనీ... ఆ పని చేసిన మహిళ

ఓ మహిళ తన భర్త నుంచి తనను తాను కాపాడుకునేందుకు పోలీసులకు చుక్కలు చూపింది. లైంగికదాడి జరుగుతున్నట్టు ఫోన్ చేస్తే పోలీసులు సత్వరం స్పందిస్తారని, 100 నంబరు మెసేజ్ పంపింది. తనపై కదులుతున్న కారులో ఇద్దరు అ

Advertiesment
Hyderabad
, శనివారం, 8 జులై 2017 (09:31 IST)
ఓ మహిళ తన భర్త నుంచి తనను తాను కాపాడుకునేందుకు పోలీసులకు చుక్కలు చూపింది. లైంగికదాడి జరుగుతున్నట్టు ఫోన్ చేస్తే పోలీసులు సత్వరం స్పందిస్తారని, 100 నంబరు మెసేజ్ పంపింది. తనపై కదులుతున్న కారులో ఇద్దరు అత్యాచారం చేస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఉరుకుపరుగులతో ఆ మహిళను రక్షించారు. తీరా విచారణలో అసలు విషయం వెల్లడైంది. హైదరాబాద్ నగరంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, మలక్‌పేట రేస్‌కోర్సులో పనిచేస్తున్న ప్రవళికకు 2009లో సంతోష్‌ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత రేస్ కోర్సులో పని చేసే శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తతో 2013లో విడాకులు తీసుకుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత శ్రీకాంత్‌తో కూడా విభేదాలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో వరంగల్ కాజీపేట్‌లోని గణపతి దేవాలయానికి దైవదర్శనానికి ప్రవళిక వెళ్లింది. బస్సులో ఉండగా శ్రీకాంత్ ఫోన్ చేయగా ఆ విషయమే చెప్పింది. కానీ, ఆమె మాటలు నమ్మని శ్రీకాంత్ స్నేహితుడు అజారుద్దీన్‌తో కలిసి ఒక వాహనాన్ని అద్దెకు తీసుకుని వరంగల్‌కు వెళ్లి ప్రవళికను ఎక్కించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
 
దీంతో విరక్తి చెందిన శ్రీకాంత్.. జనగాంలో వాహనాన్ని ఆపి మద్యం సేవించి, కారులో నిద్రపోయాడు. కానీ శ్రీకాంత్ తీరుతో భయభ్రాంతులకు గురైన ప్రవళిక తనను చంపేస్తారేమోనని భయంతో 100కు సమాచారం అందించినట్లు వివరించారు. లైంగిక దాడి పేరు చెబితే పోలీసులు త్వరగా స్పందిస్తారని భావించి, తనపై కదులుతున్న కారులో అత్యాచారం జరుగుతున్నట్టు ఫిర్యాదు చేసింది. దీంతో తక్షణం స్పందించిన పోలీసులు.. కారును వెంబడించి తార్నాకలో పట్టుకున్నారు. కారులో ఉన్న ముగ్గురిని ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగి తొలగింపులో అడ్డంగా దొరికిపోయిన టెక్ మహేంద్రా.. సారీ చెబితే ఏంటి.. పరువు పోయె