Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మృతదేహాలకు ఎంబాల్మింగ్ ఇంజెక్షన్లు.. భారీగా ఖర్చు

Advertiesment
Hyderabad
, ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:38 IST)
దిశ కేసు నిందితుల మృతదేహాలను భద్రపరచడానికి భారీగానే ఖర్చవుతోంది. మృతదేహాలు పాడవకుండా ఎంబాల్మింగ్ చేస్తున్నారు. ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. దిశ కేసు నిందితుల మృతదేహాలు పాడవకుండా భద్రపరచడానికి ఖర్చు భారీగానే అవుతోంది. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు నిందితులు మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. 
 
మృతదేహాలను పాడవ్వకుండా ఎంబాల్మింగ్ చేస్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో పాటు ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది.
ఒక్కో మృతదేహానికి రూ. 7500 విలువైన ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇస్తే మృతదేహం పాడవకుంటా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ ఇంజక్షన్లతో 4 నెలల పాటు మృతదేహాలను పాడవ్వకుండా చూడవచ్చని తెలిపారు. వారానికి ఒకసారి ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వీటిని ప్రత్యేకంగా తెప్పించి ఇస్తున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ఇచ్చేంత వరకు మృతదేహాలను ఇలాగే భద్రపరచాల్సి ఉంది.దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులూ డిసెంబర్ 6న జరిగిన ఎన్‌కౌంటర్ మరణించిన విషయం తెలిసిందే. 
 
పలు ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘం ఎన్‌కౌంటర్‌ను తప్పుబట్టాయి. కొంత మంది లాయర్లు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఘటనపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 
దిశ కేసు నిందితుల మృతదేహాలు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడే డీకంపోజ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించడానికి పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టారు. అయితే.. కోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మృతదేహాలు డీకంపోజ్ కాకుండా ప్రత్యేక ఆంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు.
ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. 
 
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య విచారణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ అంశంపై విచారణ జరుపవద్దని హైకోర్టుకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిషన్‌ అవసరాలు, ఖర్చులను కూడా తెలంగాణ ప్రభుత్వమే చూడాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీలోకి రాధా? జగన్ ఎప్పుడు రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా..?