Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. ఆమె చున్నీతోనే ఉరేసుకున్న భర్త.. ఎక్కడ?

భార్య కాళ్లు చేతులు కట్టేసిన ఓ భర్త.. భార్య చున్నీతోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ ఉప్పుగూడ అశోక్ నగర్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... అశోక్‌నగర్‌కు చెందిన కె.కా

Advertiesment
భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. ఆమె చున్నీతోనే ఉరేసుకున్న భర్త.. ఎక్కడ?
, సోమవారం, 8 మే 2017 (14:03 IST)
భార్య కాళ్లు చేతులు కట్టేసిన ఓ భర్త.. భార్య చున్నీతోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ ఉప్పుగూడ అశోక్ నగర్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... అశోక్‌నగర్‌కు చెందిన కె.కార్తీక్ కుమార్ (19) డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు మేనమామ కుమర్తె దీపారాణితో ఏడు నెలల క్రితమే వివాహమైంది. మద్యానికి బానిస అయన కార్తీక్ కుమార్.. శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తమ ఆర్థిక పరిస్థితులపై భార్యతో చెప్పుకుని బాధపడ్డాడు.
 
అనంతరం మత్తులో మద్యం బాటిల్‌తో తలపై బాదుకోవడం మొదలుపెట్టాడు. అతడి ప్రవర్తను చూసి భయపడిన భార్య వెంటనే అతడిని అడ్డుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన కార్తీక్ భార్య దీపారాణి కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆ తర్వాత ఆమె చున్నీతోనే ఇంటి దూలానికి ఉరేసుకున్నాడు. కళ్ల ముందే తన భర్త ఉరికొయ్యకు వేలాడటాన్ని చూసిన భార్య.. పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కార్తీక్‌ను కిందికి దింపి 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి కార్తీక్‌ను చూడగా, మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ విజ్ఞతతో ఆలోచన చేయడం లేదు.. చెప్పుడు మాటలకే ప్రాధాన్యత : వర్ల రామయ్య