Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి: హైదరాబాద్‌లో తనిఖీలు.. హోటల్ కిచెన్లలో ఎలుకలు.. తాండవం ఆడుతున్న అపరిశుభ్రత..

దీపావళి పండుగ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లే జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ఇక టపాకాయలు, స్వీట్ల కొనుగోళ్లు కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో స్వీట్ షాపులు కస్టమర్లతో కిటకి

Advertiesment
hyderabad hotels kitchens not clean
, గురువారం, 27 అక్టోబరు 2016 (14:37 IST)
దీపావళి పండుగ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లే జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ఇక టపాకాయలు, స్వీట్ల కొనుగోళ్లు కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో స్వీట్ షాపులు కస్టమర్లతో కిటకిటలాడనున్నాయి. ఇక హోటళ్ళ సంగతి సరేసరి. హెల్త్ శానిటేషన్ చట్టాన్ని ఇలాంటి బేకరీలు, రెస్టారెంట్లు ఉల్లంఘిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఈ బోర్డు ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం.దేవేందర్ అంటున్నారు. 
 
వంటశాలలు పరిశుభ్రంగా..వెంటిలేషన్ తో ఉండాలని, వీటిలో టాయిలెట్లు ఉండరాదని ఆయన సూచిస్తున్నారు. ఈ కిచెన్లను రోజూ శుభ్రం చేస్తుండాలి.. వృధాగా పారేసిన ఆహారాన్ని వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పారు. ఆరోగ్య సూత్రాలను పాటించని హోటళ్ళు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
 
ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు... ఇటీవల హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని చాలా హోటళ్ళు, స్వీట్ షాపులను ఆకస్మిక తనిఖీలు చేసి.. యజమానులకు షాక్ ఇచ్చారు. ఈ తనిఖీలో హోటల్స్‌లో అపరిశుభ్రత తాండవం ఆడటం గమనించారు. హోటళ్లకు చెందిన కిచెన్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. హోటళ్లలోని వంట గదుల్లో ఎలుకలు, పందికొక్కులు తిరుగాడ్డం ఈ అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
 
తిరుమలగిరిలోని ఆగ్రా స్వీట్స్, బెంగుళూరు అయ్యంగార్ బేకరీ, గ్రిల్ 9 హోటల్ అండ్ బేకరీవంటివాటి వంట గదుల్లో వెంటిలేషన్ లేకపోవడం, పనిచేసే కార్మికులు అక్కడే తిని, నిద్రపోవడం వీరికి కనిపించింది. దీంతో పరిశుభ్రత పాటించని గ్రిల్ 9 హోటల్ ను సీల్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ : 2 వేల డాలర్ల రింగ్ కొనుగోలు చేస్తే రెమింగ్టన్ షాట్‌గన్ ఉచితం