Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో దారుణం: విందుకు వచ్చి యజమానురాలిపై అత్యాచారం

Advertiesment
Hyderabad
, గురువారం, 9 జులై 2020 (18:28 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. కామాంధులకు కళ్లు మూసుకుపోతున్నాయి. ఇంటి యజమానురాలిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడి కడతేర్చారు. హైదరాబాదులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7న మంగళవారం రాత్రి జియాగూడలో ఓ ఇంటి నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఇంటి యజమాని కూలీలకు విందు ఇచ్చారు.
 
అనంతరం మద్యం మత్తులో కూలీలు ఆ ఇంటి యజమానురాలిపై అత్యాచారం చేసి ఆమెను కడతేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జియాగూడ కేశవ స్వామి నగర్‌‌కు చెందిన ఆండాళ్ అనే మహిళ కొంతకాలంగా జియాగూడలోని మేకల మార్కెట్‌లో మేకలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో జియాగూడ కేశవస్వామి నగర్‌‌లో సొంతిల్లు నిర్మిస్తున్నారు. తాజాగా భవన నిర్మాణం పూర్తికావొస్తుడడంతో ఆమె విందును ఏర్పాటు చేశారు.
 
ఆ విందుకు భవన నిర్మాణ కార్మికులను కూడా ఆహ్వానించారు. ఈ దావత్‌కు మేస్త్రీతో పాటు అతని స్నేహితుడు కూడా విందుకు హాజరయ్యాడు. వారికి భోజనం పెట్టిన అనంతరం ఆండాళ్ నిద్రపోవడానికి మొదటి అంతస్థుకు వెళ్ళింది. అది గమనించిన మేస్త్రి మిత్రుడు రవి ఆమె వెనక వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. 
 
అదే సమయంలో ఆండాళ్ కుమారుడు వెళ్లగా అతడిని నెట్టివేసి రవి అక్కడ నుండి పారిపోయాడు. పోలీసులు పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ కనిపించకపోతే రాష్ట్రంలో పాలన ఆగినట్టా?