Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్స్ రాకెట్.. కాల్ గర్ల్స్ బ్లాక్ మెయిల్.. రూ.30లక్షలు గోవిందా.. అంతా ఫేస్‌బుక్ తంటా!

అందమైన అమ్మాయి కోసం ఓ వ్యాపారి నష్టపోయాడు. కాల్ గర్ల్స్ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యాడు. రూ.30లక్షల వరకు జేబును గుల్ల చేసుకున్నాడు. ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ముంబై కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాక

సెక్స్ రాకెట్.. కాల్ గర్ల్స్ బ్లాక్ మెయిల్.. రూ.30లక్షలు గోవిందా..  అంతా ఫేస్‌బుక్ తంటా!
, శుక్రవారం, 17 మార్చి 2017 (10:57 IST)
అందమైన అమ్మాయి కోసం ఓ వ్యాపారి నష్టపోయాడు. కాల్ గర్ల్స్ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యాడు. రూ.30లక్షల వరకు జేబును గుల్ల చేసుకున్నాడు. ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ముంబై కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. హైదరాబాదులోని బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారికి ముంబైకి చెందిన దేవేందర్ శెట్టి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చాటింగ్‌ స్నేహం మొదలైంది. నిరుడు అక్టోబర్‌లో దేవేందర్‌శెట్టి ముంబై కాల్‌గర్ల్స్‌ గురించి చెప్పాడు.
 
పదివేలు ఇస్తే అందమైన అమ్మాయిని పంపుతానని చెప్పాడు. ముగ్గురు యువతుల ఫోటోలు పంపాడు. వ్యాపారి ఇష్టపడిన ఫోటోలోని ఓ యువతి అక్టోబర్ 8న నగరానికి వచ్చింది. వ్యాపారితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తన సెల్‌ఫోన్‌లో బంధించింది. అతడు బాత్రూమ్‌లోకి వెళ్లగానే వ్యాపారి మొబైల్‌ ఫోన్‌ నుంచి అతడి కుటుంబ సభ్యుల ఫోన్‌నెంబర్లు, వ్యక్తిగత ఫొటోలు తీసుకుంది.  
 
ముంబై వెళ్లిన తర్వాత కాల్‌గర్ల్స్‌తో ఉన్నట్లు ఫోటోలు రూపొందించారు. వారం రోజుల తరువాత వ్యాపారికి ఫేస్‌బుక్‌ స్నేహితుడి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాల్‌గర్ల్స్‌తో ఉన్న ఫొటోలను యూట్యూబ్‌లో పెడతానని, కుటుంబ సభ్యులకు పంపుతానంటూ బెదిరించాడు. పరువుపోతుందని ఆరునెలల పాటు డబ్బు పంపాడు. ఇక లాభం లేదనుకుని ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కే నగర్‌ రేసులో అమ్మ నమ్మినబంటు.. తెలుగు వ్యక్తి మధుసూధన్