హైదరాబాద్ నగరంలో బాలుడిపై మరో బాలుడు మరో అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రహ్మత్ నగర్ సమీపంలోని హబీబ్ ఫాతిమానగర్‌లో నివాసముంటున్న బాలుడు (9) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత సమీపంలోని ట్యూషన్‌కు వెళ్లాడు.
తర్వాత చాక్లెట్ కొనేందుకు దుకాణం వద్దకెళ్లగా.. బాలుడికి తెలిసిన స్నేహితుడు (13) ఇంటికి రావాలంటూ బలవంతంగా తీసుకువెళ్లాడు. ఎవరూ లేకపోవడంతో బాలుడిపై అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు.
దీంతో బాలుడు తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే, బాలుడిపై అసహజ లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.