Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ల్యాప్‌టాప్‌లో సూసైడ్ నోట్.. బతకాలని లేదు.. తమ్ముడూ వారిని బాగా చూసుకో?

ఓ యువకుడికి బతకాలనించలేదు. అందుకే అమ్మానాన్నలను బాగా చూసుకో తమ్ముడూ అంటూ ల్యాప్‌టాప్‌లో ఆత్మహత్య లేఖ రాసి కనిపించకుండా పోయాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ అనే యువకుడు

ల్యాప్‌టాప్‌లో సూసైడ్ నోట్.. బతకాలని లేదు.. తమ్ముడూ వారిని బాగా చూసుకో?
, బుధవారం, 7 జూన్ 2017 (12:06 IST)
ఓ యువకుడికి బతకాలనించలేదు. అందుకే అమ్మానాన్నలను బాగా చూసుకో తమ్ముడూ అంటూ ల్యాప్‌టాప్‌లో ఆత్మహత్య లేఖ రాసి కనిపించకుండా పోయాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ అనే యువకుడు ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు.

నగరంలోని అంబర్ పేటలో ఓ గదిలో ఉంటున్నాడు. రూమ్ నుంచి మంగళవారం ఉదయం వెళ్లిన నిఖిల్ తిరిగిరాకపోవడంతో అతడి స్నేహితులు, తమ్ముడు ఆ రూమ్‌కు వెళ్లి చూశారు. నిఖిల్ తన ల్యాప్‌టాప్‌లో సూసైడ్ లెటర్ రాసినట్లు గమనించారు. 
 
ఈ లెటర్లో నిఖిల్ తల్లిదండ్రులకు సారీ చెప్పాడు. తల్లిదండ్రులను తమ్ముడు బాగా చూసుకోవాలని సూచించాడు. ఇక‌ తనకు బతకాలని లేదని రాశాడు. ఈ విష‌యం గురించి తెలుసుకున్న నిఖిల్ తల్లితండ్రులు తమ పెద్ద కుమారుడి కోసం ఆందోళ‌న చెందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఆ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేఘాలయాలో బీఫ్‌పై నిషేధమే లేదంటున్న బీజేపీ.. కానీ యూపీతో గూండాచట్టం కింద?