Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాకింగ్‌కు వెళ్లిన 8th క్లాస్ విద్యార్థిని పట్టుకుని రేప్ చేసి చంపేశారు.. ఎక్కడ?

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. వాకింగ్ కోసం వెళ్లి ఎనిమిదో తరగతి విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆ బాలికను కొందరు కామాంధులు పట్టుకుని అత్యాచారం చేసి చివరకు ప్రాణాలే లేకుండా చేశారు. ఈ దారుణం

Advertiesment
వాకింగ్‌కు వెళ్లిన 8th క్లాస్ విద్యార్థిని పట్టుకుని రేప్ చేసి చంపేశారు.. ఎక్కడ?
, మంగళవారం, 28 ఆగస్టు 2018 (09:22 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. వాకింగ్ కోసం వెళ్లి ఎనిమిదో తరగతి విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆ బాలికను కొందరు కామాంధులు పట్టుకుని అత్యాచారం చేసి చివరకు ప్రాణాలే లేకుండా చేశారు. ఈ దారుణం హైదరాబాద్‌ మేడిపల్లి ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ బ్రహ్మణపల్లికి చెందిన వేవూరి అనసూయ, ప్రభు కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. అనసూయ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. వీరు బడంగ్‌పేటలోని రాజీవ్‌ గృహకల్ప 10వ బ్లాక్‌లో మూడేళ్లుగా ఉంటున్నారు. వీరికి వైష్ణవి (14) అనే బాలిక ఉండగా, ఈ బాలిక జిల్లెలగూడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. 
 
వైష్ణవికి ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లే అలవాటు ఉంది. దీంతో ఆదివారం ఉదయం కూడా వాకింగ్ కోసమని ఉదయం 6 గంటలకు బయటకు వెళ్లగా తిరిగి ఇంటికిరాలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి అనసూయకు బిడ్డ కనిపించక పోవడంతో ఇరుగుపొరుగు ఇళ్ళలో గాలించింది. అయినా ఆచూకీ తెలియకపోవడంతో రాత్రి 7 గంటల సమయంలో మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. 
 
అయితే సోమవారం ఉదయం ఆరు గంటలకు రాజీవ్‌ గృహకల్పలోని అంగన్‌వాడీ భవనం పక్కన ఓ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనసూయ, ప్రభు దంపతులకు విషయాన్ని తెలియజేశారు. వారు అక్కడి వెళ్లి చూడగా తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో వైష్ణవి జీవచ్ఛవంగా పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుని రోదించడం అందరినీ కలచివేసింది.  
 
కాగా, వైష్ణవిని గుర్తు తెలియని కామాంధులు కొందరు ఉదయాన్నే కిడ్నాప్‌.. ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అదీ కూడా నీటిలో ముంచి శ్వాస ఆగిపోయేలా చేసి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళతో సహజీవనం.. స్నేహితురాలితో అక్రమ సంబంధం.. నిరుద్యోగి రాసలీలలు