Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజలు పేరుతో భార్యను అడవిలోకి తీసుకెళ్లి హతమార్చిన భర్త

భార్యపై అనుమానం పెనుభూతమైంది. పూజ పేరుతో అడవిలోకి తీసుకెళ్లి భార్యను హతమార్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌ మండలం పలుగు తండాకు చెందిన రమావత్‌ శ్ర

Advertiesment
పూజలు పేరుతో భార్యను అడవిలోకి తీసుకెళ్లి హతమార్చిన భర్త
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (10:09 IST)
భార్యపై అనుమానం పెనుభూతమైంది. పూజ పేరుతో అడవిలోకి తీసుకెళ్లి భార్యను హతమార్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌ మండలం పలుగు తండాకు చెందిన రమావత్‌ శ్రీరాం, రమావత్‌ లలిత(20) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. 
 
వీరిద్దరూ తుక్కుగూడలో నివసిస్తున్నారు. దంపతులిద్దరి మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి యాచారం మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో గల తాటికొండ మైసమ్య ఆలయానికి సోమవారం తీసుకెళ్లాడు. 
 
పూజలు చేసిన అనంతరం ఆలయం పక్కనగల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మాటల్లో పెట్టి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, రమావత్‌ వ్యవహారశైలిని సందేహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. 
 
ఆమెపై అనుమానంతో తానే చంపేసినట్టు తెలిపారు. తాటికొండ మైసమ్మ దేవాలయం వద్ద అటవీ ప్రాంతంలో చంపేసి పడవేశానని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. మృతదేహం కుళ్లిపోయి ఉంది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును రాక్షసుడు.. నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు : జగన్