Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పక్కింటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చంపేశాడు..

పక్కింటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చంపేసిన భర్తకు జీవితశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన నలుకుర్తి పుష్పరాజు, రావమ్మ

పక్కింటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చంపేశాడు..
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (08:35 IST)
పక్కింటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చంపేసిన భర్తకు జీవితశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన నలుకుర్తి పుష్పరాజు, రావమ్మ భార్యాభర్తలు. వీరి ముగ్గురు పిల్లలకు వివాహాలయ్యాయి. మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య రావమ్మకు చుట్టు పక్కల వారితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించేవాడు. అనేకమార్లు ఆమెతో ఈ విషయంపై గొడవపడ్డారు. రావమ్మ తన తీరుతో కుటుంబ పరువు తీస్తోందని ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. 
 
2015 జనవరి 21న అర్థరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రావమ్మతో గొడవ పెట్టుకున్నాడు. రోకలిబండతో ఆమె తలపై మోదడంతో ఆమె కేకలు వేస్తూ కుప్పకూలింది. ఆ కేకలకు పక్కన ఉంటున్న పెద్ద కొడుకు శ్రీకాంత్‌, చుట్టుపక్కల వారు రావడంతో పుష్పరాజు పరారయ్యాడు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 
 
కొడుకు శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో వెంగళాయపాలెంకు చెందిన నలుకుర్తి పుష్పరాజు అనే నిందితునికి జీవిత ఖైదు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ 2వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి బి.మంజరి తీర్పునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపి కండువాతోనే చనిపోవాలని 1993లోనే అనుకున్నా... దేవినేని నెహ్రూ