Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెసిఆర్, జగన్ బీజేపీకి ఎలా లొంగిపోయారు? ఎంత ఒత్తిడి ఫలితమో ఇది!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోందని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని బీజేపీ స్పష్టమైన అవగాహనకు వచ్చింది. అందుకే తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష

కెసిఆర్, జగన్ బీజేపీకి ఎలా లొంగిపోయారు? ఎంత ఒత్తిడి ఫలితమో ఇది!
హైదరాబాద్ , శనివారం, 13 మే 2017 (09:21 IST)
ఉత్తర భారత రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన కోరలను దక్షిణ భారత దేశంవైపు చాచింది. ఇప్పటికే అన్నాడిఎంకే పార్టీని నిలువునా చీల్చి మాజీ సీఎం పన్నీర్ సెల్వంను తన పట్టులోకి తెచ్చుకుని తమిళనాడు రాజకీయాల్లో తొలిసారిగా పట్టు సాధించిన బీజేపీ కర్నాటకలో మళ్లీ తన పట్టును సాధించుకుంది. అలాగే కేరళలో బలమైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించింది. 
 
ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ తక్షణ లక్ష్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోందని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని బీజేపీ స్పష్టమైన అవగాహనకు వచ్చింది. అందుకే తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కన్నేసింది. అయితే జగన్‌కు ఎలాంటి ఆహ్వానం పంపకుండానే బీజేపీ నాయకత్వం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును తీవ్రతరం చేయడం ద్వారా కేంద్రానికి తనకు తానుగా  లొంగిపోయేలా ఒత్తిడిని తీసుకొచ్చింది. చివరకు తనపై తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేకపోయిన జగన్ చివరకు బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించారు.
 
అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి చర్యలపై కొన్ని నిర్దిష్ట పత్రాలను ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. దీంతో చంద్రబాబును కూడా బ్లాక్ మెయిల్ చేయగల అవకాశం మోదీ వద్దకే వచ్చింది. ఇలా ఒక దెబ్బకు రెండు పిట్టలు చందాన మోదీ అటు జగన్, ఇటు చంద్రబాబు జుత్తును తన గుప్పిట్లోకి తీసుకున్నారు. 
 
ఇక తెలంగాణలో తెరాస నాయకత్వంపై మోదీ ఒత్తిడి తీసుకొచ్చారు. కేసీఆర్, అతడి కుటుంబ సభ్యుల అవినీతికి సంబంధించి ప్రధాని బలమైన సాక్ష్యాధారాలను చేజిక్కించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో తల్చుకుంటే కేసీఆర్ కుటుంబంపై ఏ క్షణంలోనైనా ఈడీ దర్యాప్తు చేయగల పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ తాజాగా ఢిల్లీ సందర్శించడం బీజేపీ నాయకత్వంతో రాజీపడ్డానికే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈవిధంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో టీఆరెస్ కూడా బీజేపీకే మద్దతు నిస్తున్నట్లు ప్రకటించేసింది. 
 
ఇలా ఆంధ్ర, తెలంగాణలోని బలమైన పార్టీలు తన గుప్పిట్లోకి వచ్చాక బీజేపీ దక్షిణాదిపై పూర్తి పట్టు సాధించగలనని విశ్వసిస్తోంది. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికార పార్టీనీ, ప్రతిపక్ష పార్టీనీ అవలీలగా తన ఏలుపడిలోకి తెచ్చుకోవడం కాంగ్రెస్ అధిష్టానాన్ని షాక్‌కి గురిచేస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీం దగ్గర కోట్లు దొబ్బితిన్నది మీరు... సస్పెన్షన్లు మాకా... అన్నీ బయటపెడతామన్న ఏసీపీ