Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్ సరిహద్దు వద్ద ఎంతమంది సైనికులు... చెప్పినందుకు డబ్బు, అమ్మాయిలు... ఇదీ అక్తర్ ఫార్ములా

వాడేమైనా పుడింగి అనుకున్నాడేమోగానీ భారతదేశ రక్షణకు సంబంధించిన రహస్య వివరాలను పాకిస్తాన్ దేశానికి చేరవేయడమే పనిగా పెట్టుకున్నాడు. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిగా పనిచేస్తూ పాకిస్తాన్ దేశానికి భారత్ రహస్య సమాచారాన్ని చేరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన మహ్మద్

పాక్ సరిహద్దు వద్ద ఎంతమంది సైనికులు... చెప్పినందుకు డబ్బు, అమ్మాయిలు... ఇదీ అక్తర్ ఫార్ములా
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (17:03 IST)
వాడేమైనా పుడింగి అనుకున్నాడేమోగానీ భారతదేశ రక్షణకు సంబంధించిన రహస్య వివరాలను పాకిస్తాన్ దేశానికి చేరవేయడమే పనిగా పెట్టుకున్నాడు. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిగా పనిచేస్తూ పాకిస్తాన్ దేశానికి భారత్ రహస్య సమాచారాన్ని చేరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన మహ్మద్ అక్తర్ పోలీసులకు పలు విషయాలను వెల్లడించాడు. 
 
పాకిస్తాన్ హైకమిషన్లో వీసా విభాగంలో అక్తర్ పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో అతడు వీసా కోసం తనవద్దకు వచ్చేవారిలో ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నవారిని టార్గెట్ చేసేవాడు. అలా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు చిక్కుకున్నారు. వీరికి డబ్బు ఎర చూపి బీఎస్ఎఫ్ రహస్యాలు, భారత్-పాక్ సరిహద్దు వద్ద ఏయే ప్రాంతాల్లో సైనికుల పహారా ఉంటుంది, ఎంతమంది సైనికులు పహారా కాస్తుంటారు... తదితర వివరాలన్నిటినీ రాబడుతుండేవాడు. 
 
ఈ సమాచారం చెప్పినందుకు వారికి భారీమొత్తంలో డబ్బు ముట్టజెప్పేవాడు. కొన్నిసార్లు కీలక సమాచారాన్ని రాబట్టేందుకు హనీట్రాప్... అమ్మాయిలను ఎరగా వేసి సాధించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే వీటన్నిటిపైనా విచారణ సాగుతున్నట్లు అధికారులు చెపుతున్నారు. కాగా ఈ కేసులో పాకిస్తాన్ హైకమిషన్ కు కూడా సంబంధం ఉన్నదేమోనన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా అక్తర్ తను ఎవరితోనైనా మాట్లాడదలుచుకుంటే కోడ్ భాష ఉపయోగించి మాత్రం సందేశాలను పంపినట్లు పోలీసులు కనుగొన్నారు. ఐతే ఈ కోడ్ భాష అర్థమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జై పాతాళ భైరవి' అనగానే అమరావతి నగరం ఊడిపడదు... వెంకయ్య నాయుడు