Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు.. వారానికే విడిపోయారు..

Advertiesment
హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు.. వారానికే విడిపోయారు..
, శుక్రవారం, 5 జూన్ 2020 (13:42 IST)
హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు. కానీ వారానికే విడిపోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీతో బాధపడుతున్నారు. నెలలో రెండుమూడు సార్లు మహబూబ్ నగర్‌లోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చేవాడు. ఇదే క్రమంలో మహబూబ్ నగర్‌కు చెందిన ఓ యువతి సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లేది. 
 
ఈ క్రమంలో వీరిద్దరిని కౌన్సెలింగ్ కేంద్రం సిబ్బంది సమన్వయం కుదిర్చి ఫిబ్రవరి ఒకటో తేదీన వివాహం జరిపించారు. భార్యభర్తలిద్దరూ వారం రోజుల పాటు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత ఏమైందో గానీ ఓ రోజు భర్త సినిమాకు వెళ్తునానంటూ బయటకు వెళ్లాడు. మూడు నెలలైనా ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 20 నుంచి కాలేజీల్లో పరీక్షలు.. స్టూడెంట్లకు అవి తప్పనిసరి..