వెలగపూడిలోని సచివాలయంలో అసెంబ్లీ సమావేశం జరుగుతున్న దృష్ట్యా సచివాలయ పరిసర ప్రాంతాల్లో గుంటూరు రూరల్ పోలీసులు పటిష్టమైన బందోస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర గౌరవ అదనపు డిజీపీ రవి శంకర్ అయ్యనార్, ఆధ్వర్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు హాజరవుతున్న సందర్భంగా అసెంబ్లీ, మండలి సమావేశ ప్రాంగణాలు, సచివాలయ పరిసర ప్రాంతాల్లో పూర్తి పటిష్ఠమైన భద్రత చర్యలు తీసుకున్నామని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణం, సచివాలయ పరిసర ప్రాంతాల్లో కలియ తిరిగి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో మాట్లాడి, అసెంబ్లీ సమావేశము ముగిసే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించాలని, ఎలర్ట్ గా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రాజకీయ హీట్ ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ ప్రత్యక పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఈసారి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.