Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భక్తుల భ‌ద్ర‌త‌కే అధిక ప్రాధాన్యత: దేవ‌దాయ శాఖ మంత్రి

భక్తుల భ‌ద్ర‌త‌కే అధిక ప్రాధాన్యత: దేవ‌దాయ శాఖ మంత్రి
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (17:24 IST)
ఇటివ‌ల క‌రోనాతో తిరుమ‌ల‌, దుర్గ‌గుడి అర్చ‌కుల మృతికి దేవ‌దాయ ధ‌ర్మ‌దాయశాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు సంతాపం, వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలిపారు. 
 
కేంద్ర‌, రాఫ్ట్రాల నిభంద‌న‌ల‌ను అనుస‌రించి, మార్గ‌ధ‌ర్శ‌కాల‌ ప్ర‌కారం ఆల‌యంలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించిన త‌రువాతనే  భ‌క్తుల‌కు అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కోవిడ్ నియమనిబంధనలను పాఠించుచూ...భక్తులకు దైవదర్శనము ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.
 
కరోనా కారణంగా దేవాల‌యాల్లో   పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించిన త‌రువాతనే భ‌క్తుల‌కు అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని భ‌క్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌న‌లు చేసుకోవ‌చ్చున‌ని, ప్ర‌తి భ‌క్తుడు వి.ఐ.పినే  అని  మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.
 
భ‌క్తులు మైరుగైన సేవ‌లందించేందుకు కృషి చేస్తామన్నారు. క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేవాల‌యాల్లో యధావిధిగా యజ్ఞాలు, హోమాలు, నిత్య పూజలు మరియు కైంకర్యాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. 
 
65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు  ఆలయాలకు రాక‌పోవ‌డం మంచిదని సూచించారు.
 
ఇందుకు అనుగుణంగా ఆలయాల‌కు వ‌చ్చే  భక్తులకు సూచనలు, విస్త్ర‌తంగా ప్ర‌చారం చేయాల‌ని  అధికారుల‌కు మంత్రి అదేశించారు. భక్తులు దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నపుడు కనీసం ఆరడుగుల సామాజిక‌ దూరం తప్పకుండా పాటించాల‌న్నారు. 
 
ఇందుకోసం  అన్ని ఆల‌యాల్లో మార్కింగ్స్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు, ఫేస్ కవర్స్ లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాల‌న్నారు.
 
భ‌క్తులు ఎలాంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలన్నారు. భక్తులందరికీ ఆరోగ్యసేతు యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆలయంలో దేవతామూర్తులను, పవిత్ర గ్రంథాలను తాకకూడదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్