Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై ఆస్తులు.. ఏపీ హైకోర్టులో అశోక్ గజపతిరాజుకు ఊరట

Gajapathi
, బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:35 IST)
కేంద్ర మాజీ మంత్రి, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.  . చెన్నై మైలాపూర్‌లోని 37,902 చదరపు అడుగుల భూమికి సంబంధించిన దస్త్రాలను తీసుకుని స్వయంగా హాజరుకావాలంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులను హైకోర్టు నిలిపివేసింది.
 
ఏ వివరాల ఆధారంగా అశోక్‌గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది.
 
ఈ కేసు వివరాల రికార్డులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని ఈడీ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి వివాదంలో ఈడీ ఎలా జోక్యం చేసుకుంటుందని నిలదీసింది.
 
కాగా ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి కేసులో అంగ్ సాన్ సూకీ ఐదేళ్ళ జైలుశిక్ష