లాక్డౌన్ కారణంగా టెన్త్ పరీక్షలు నిర్వహించకుండా ప్రీఫైనల్ పరీక్షా ఫలితాల ఆధారంగా ప్రమోట్ చేయాలనే అంశంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.
కరోనా నేపథ్యంలో ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కాకినాడకు చెందిన సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ అధ్యక్షుడు టి.భవాని ప్రసాద్ పిల్ వేశారు.
దీనిని బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ బి.కఅష్ణ మోహన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్ విచారించింది.