Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు: అత్యధిక ఉష్ణోగ్రత 42.4 డిగ్రీలు నమోదు..

తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటివరకు 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే నమోదు అవుతున్నాయి. తిరుపతిలో 43.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతల

భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు: అత్యధిక ఉష్ణోగ్రత 42.4 డిగ్రీలు నమోదు..
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:32 IST)
తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటివరకు 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే నమోదు అవుతున్నాయి. తిరుపతిలో 43.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం పూట గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా మరో 4డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చునని పేర్కొంది. 
 
ఎండలకు తాళలేక చాలామంది ఇంటికే పరిమితమవుతుండగా, మరోవైపు పంటలకు భారీ నష్టం తప్పట్లేదు. నీటి కొరత, ఎండ వేడిమికి పంటలు ఎండిపోతున్నాయి. శనివారం నాడు ఎండ వేడి తట్టుకోలేక వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు సమర్పించిన రెండు కోడెలు మృతి చెందాయి. గడిచిన 25రోజుల్లో మొత్తం 15ఎద్దులు మృత్యువాత పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
 
అత్యధిక వేడి వడగాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లాలంటే జడుసుకుంటున్నారు.  అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు, నిజామాబాద్‌లో 42, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండలో 41, హైదరాబాద్, హన్మకొండలో 40, ఖమ్మం, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత ఆస్తులకు వారసుడు ఎక్కడ..? ఇంకెందుకు ఆలస్యం.. సర్కారుకే ఇచ్చేయొచ్చుగా?