Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు మరికొన్ని రోజులు జైల్లోనే ... సుప్రీంకోర్టులోనూ నిరాశ...

chandrababu naidu
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:16 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరికొన్ని రోజులు జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనపై బనాయించిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు మూడో తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా, ద్విసభ్య ధర్మాసనం నుంచి జడ్జి ఎస్వీ భట్టి తప్పుకున్నారు. ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్ళీ మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‍‌ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయలానేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబు మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్థన అని లుథ్రా విన్నవించారు. 
 
17ఏ అనేది కేసు మూలల నుంచి వచ్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని చప్పారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. జడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తస్రావం, అర్ధనగ్నంగా రోడ్డుపై అత్యాచార బాధితురాలు.. సాయం కోసం..?