Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ కోస్తా క్లీనప్ దినోత్సవం 2025: క్లీనప్ ఉద్యమానికి HCL ఫౌండేషన్ నేతృత్వం

Advertiesment
International Coastal Cleanup Day

ఐవీఆర్

, సోమవారం, 22 సెప్టెంబరు 2025 (21:48 IST)
భారతదేశంలో, అంతర్జాతీయ సాంకేతికపరిజ్ఞాన కంపెనీ HCL టెక్ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత అజెండాను నిర్వహించే HCL ఫౌండేషన్, భారతదేశపు ఆరు రాష్ట్రాలు- ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఒదిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అంతర్జాతీయ కోస్తా క్లీనప్ దినోత్సవం 2025 సందర్భంగా కోస్తా క్లీనప్ క్యాంపెయిన్‌ను ముందుండి నడుపుతోంది.   
 
ఈ కార్యక్రమం స్థానిక సమాజాలలో, HCL టెక్ ఉద్యోగులు, భాగస్వామ్య సంస్థల్లో, జాగృతిని కలిగించింది. తత్ఫలితంగా, 5000 మందికి పైగా స్వఛ్ఛంద కార్యకర్తలు దాదాపు 20,000 కిలోగ్రాముల సముద్రజలాల వ్యర్ధాన్ని తొలగించారు. భారతదేశపు కోస్తా, సముద్రజలాల ఎకో వ్యవస్థను పరిరక్షించాలన్న HCL ఫౌండేషన్ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది.
 
ఈ సంవత్సరపు క్యాంపెయిన్‌కు, ప్రముఖ పర్యావరణ సంస్థలు సహాయసహకారాలను అందించటం మరింత బలాన్నిచ్చింది. ఆ సంస్థల్లో యానిమల్ వెల్ఫేర్ కన్సర్వేషన్ సొసైటీ, రీఫ్­వాచ్ మెరైన్ కన్సర్వేషన్, స్పందన్, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎన్విరాన్మెంటరిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్ రీసెర్చ్ కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ సెంటర్, ప్లాన్ ఎట్ ఎర్త్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ ట్రస్ట్, ట్రీ ఫౌండేషన్ ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలలో, HCL ఫౌండేషన్ ఇంకా దాని భాగస్వాములు, భారతదేశపు కోస్తాజలాల నుండి 560,000 కిలోగ్రాముల ఘోస్ట్ నెట్లను, సముద్రజలాల వ్యర్ధపదార్ధాలను విజయవంతంగా తొలగించాయి.
 
2024లో HCL ఫౌండేషన్, భారతీయ కోస్తా తీరగస్తీ దళం, ద హాబిటాట్స్ ట్రస్ట్(THT)లు, భారతదేశపు సముద్ర జీవజాలం ఎదుర్కుంటున్న సవాళ్ళను పరిష్కరించేందుకు ఒక త్రైపాక్షిక అవగాహనా పత్రం(ఎంఒయు)పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యం, దేశపు కోస్తాతీరం వెంబడి ప్రభావవంతమైన పరిరక్షణాపరమైన కృషిని నిర్వహించటం కోసం కార్యనిర్వహణాపరమైన సామర్ధ్యాన్ని, మౌలికస్థాయిలో కృషి జరిపేందుకు వీలును కల్పిస్తుంది.
 
అంతర్జాతీయ కోస్తా క్లీనప్ దినోత్సవం 2025 నాడు, HCL ఫౌండేషన్, భారతీయ కోస్తా తీరగస్తీ దళం, THT సంయుక్తంగా జాతీయ క్లీనప్ క్యాంపెయిన్లో పాల్గొని, సముద్రజలాల పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించాయి. పరిస్థితులను ఎదురొడ్డి నిలదొక్కుకునే, సర్వజనీనమైన సమాజాలను నిర్మించాలన్న మా కృషికి పర్యావరణ సుస్థిరత కేంద్రబిందువు అని డా. నిధి పుంధీర్, SVP, గ్లోబల్ CSR, HCL టెక్ మరియు డైరెక్టర్, HCL ఫౌండేషన్ చెప్పారు. మా కోస్తా క్లీనప్ కార్యక్రమం చెత్తను తొలగించటానికి మించినది. అది సంయుక్త బాధ్యతకు స్ఫూర్తిని ఇస్తుంది, పర్యావరణ సారధ్య సంస్కృతిని కలిగిస్తుంది. మా భాగస్వామ్యాల ద్వారా మేము భారతదేశపు సముద్రజలాల ఈకోవ్యవస్థలను పరిరక్షించేందుకు, పునరుద్ధరించేందుకు మేము చేసే కృషిని పటిష్టం చేసుకుంటున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య బంగారాన్ని తాకట్టు పెట్టింది.. నా మాట వినలేదు.. అందుకే చంపేశాను