Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిలో ఐటీ దిగ్గజం.. రూ.750 కోట్లు.. 7,500 ఉద్యోగాలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ దిగ్గజం కంపెనీ వచ్చేసింది. దేశ ఐటీ రంగానికి వెన్నెముకగా ఉన్న హెచ్.సి.ఎల్. కంపెనీ తన శాఖను అమరావతిలో ప్రారభించనుంది.

Advertiesment
అమరావతిలో ఐటీ దిగ్గజం.. రూ.750 కోట్లు.. 7,500 ఉద్యోగాలు
, మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:04 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ దిగ్గజం కంపెనీ వచ్చేసింది. దేశ ఐటీ రంగానికి వెన్నెముకగా ఉన్న హెచ్.సి.ఎల్. కంపెనీ తన శాఖను అమరావతిలో ప్రారభించనుంది. ఈ సంస్థ కార్యాలయానికి కూడా సోమవారం భూమిపూజ కూడా జరిగింది. మొత్తం రూ.750 కోట్ల వ్యయంతో ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. హెచ్.సి.ఎల్ ద్వారా మొత్తం 7500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
 
గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఈ సంస్థ తొలి క్యాంప్‌సకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌, హెచ్‌సీఎల్‌ సీఈవో రోషినీ నాడార్‌ పాల్గొన్నారు. హెచ్.సి.ఎల్ అధినేత శివ్‌ నాడార్‌తో పలు దఫాలు లోకేశ్‌ చర్చలు జరిపి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించడమే గాక.. ఏడాది కాలంలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన దశకు తీసుకొచ్చారు. 
 
తొలి దశలో గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 28 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ భవనం నిర్మిస్తారు. ఏడాదిలోపు దీనిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ రూ.400 కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అనంతరం రాజధాని అమరావతిలో 20 ఎకరాల్లో మరో క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడ రూ.350 కోట్ల పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమరావతి క్యాంప్‌సను ఐదేళ్లలో సిద్ధం చేస్తారు. రాష్ట్ర ఐటీ రంగంలో హెచ్‌సీఎల్‌ ఆగమనం మెగా పెట్టుబడిగా భావించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్న చెంపదెబ్బ కొట్టాడనీ.. కిరాయి ముఠాతో కాల్పులు...