మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సొంత వదినపై మరుదులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు భర్త, అత్తమామలు కూడా ఒత్తిడి తెచ్చిన ఘటన గుంటూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాత గుంటూరుకు చెందిన బాధితురాలికి 2011లో వివాహమైంది.
విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన మామ కాళ్లు పట్టాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె అలాగే చేసేది. ఈ క్రమంలో అతడు కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత ఇద్దరు మరుదులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.
నాలుగో మరిది పాలల్లో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. విషయాన్ని భర్తకు చెబితే అలా ఇష్టం అయితేనే ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో వారి అరాచకాలు భరించలేని ఆమె వారిపై వేధింపుల కేసు పెట్టింది. ప్రతిగా నిందితులు ఆమెపై దొంగతనం కేసు మోపి అరెస్ట్ చేయించారు.