అల్లారు ముద్దుగా పెంచుకున్నా... ఈ పరిస్థితి మరొకరికి రాకూడదనే చంపేశా
నా కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకున్నా.. కానీ, నా కుమార్తె అనుమానాస్పదంగా, దిక్కులేనిదిగా చనిపోయింది. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్న ఉద్దేశ్యంతోనే రౌడీ షీటర్ గుంటి రాజేష్‌ను చంపేసినట్టు అనూష
నా కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకున్నా.. కానీ, నా కుమార్తె అనుమానాస్పదంగా, దిక్కులేనిదిగా చనిపోయింది. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్న ఉద్దేశ్యంతోనే రౌడీ షీటర్ గుంటి రాజేష్‌ను చంపేసినట్టు అనూష తండ్రి శ్యామ్‌సుందర్ రెడ్డి చెప్పారు.
తనెల 27న అర్థరాత్రి హైదరాబాద్ నగర పరిధిలోని ఆదిభట్ల ఠాణా పరిధిలోని తుర్కయాంజల్‌లో గుంటి రాజేశ్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శ్యాంసుందర్ రెడ్డి, మహ్మద్ కరీమొద్దీన్, కుంచెపు రమణ, పొగరి దయాకర్, చింతల శ్యామ్‌సుందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులోని ప్రధాన నిందితుడైన శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ 'ప్రేమ పేరుతో మహిళల జీవితాలతో రాజేశ్ చెలగాటమాడాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. గతంలో రాజేశ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలియడం వల్లే అనూష ఆత్మహత్య చేసుకుంది. అందుకే ఆ దుర్మార్గుడిని మట్టుబెట్టా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది' అని అనూష తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి
కాగా, కరుడుగట్టిన నేరగాడు రాజేశ్‌పై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్‌ల నుంచి ల్యాండ్ సెటిల్‌మెంట్ల వరకు దందాలు చేసేవాడు. అప్పటి సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అతడిపై పీడీయాక్ట్ చేశారు. కాగా, గుంటి రాజేశ్ మొత్తం 20 మంది మహిళలను ప్రేమపేరుతో మోసం చేసినట్లు నిర్ధారించారు.