Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

Advertiesment
raghuramakrishnam raju

ఠాగూర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (18:33 IST)
గత వైకాపా ప్రభుత్వంలో నాటి వైకాపా ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజుపై దేశ ద్రోహం కేసు నమోదు, అరెస్టు కేసు, చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి చీఫ్‌గా పని చేసిన డాక్టర్ ప్రభావతిని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్ఆర్ఆర్‌ను చితకబాదిన విషయంలో ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారు. సీఐడీ కస్టడీ అనంతరం రఘురామను వైద్యబృందం పరీక్షించి నివేదిక ఇవ్వగా, ఆ నివేదికను డాక్టర్ ప్రభావతి తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రభావతికి అరెస్టు భయం పట్టుకుంది. దీంతో గుంటూరు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను నేడు న్యాయస్థానం విచారించగా, రఘురామకృష్ణరాజు తరపున ఆయన న్యాయవాది లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
 
రఘురామపై నాడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆయన రెండు కాళ్లపై బలమైన దెబ్బలు ఉన్నాయని, వాపు కూడా కనిపించిందని లక్ష్మీనారాయణ తన పిటిషన్ లో వివరించారు. కానీ, డాక్టర్ ప్రభావతి వాస్తవాలకు భిన్నంగా నివేదిక ఇచ్చారని, తద్వారా రఘురామపై హత్యాయత్నంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారని కోర్టుకు వివరించారు.
 
రఘురామకు బైపాస్ సర్జరీ జరిగిందని, అలాంటి వ్యక్తిని గుండెలపై కూర్చుని బాదారని, ఈ విషయాన్ని డాక్టర్ ప్రభావతి తన నివేదికలో ఉద్దేశపూర్వకంగా విస్మరించారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వాదనలు ఆలకించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి