Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు గవర్నర్ హరి చందన్ ఘన నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు గవర్నర్ హరి చందన్ ఘన నివాళి
, శనివారం, 31 అక్టోబరు 2020 (20:01 IST)
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ జయంతి  సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్  హరిచందన్  ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్  హరిచందన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చారిత్రక నిర్ణయాలు తీసుకొని వాటిని ఉక్కు సంకల్పంతో అమలు చేసి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుపు అందుకున్నారని వివరించారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్  భారత దేశానికి చేసిన గొప్ప ఉపకారం రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేయ టమని గవర్నర్ హరిచందన్ అన్నారు.

బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపెట్టే సమయానికి అనేక రాచరిక రాష్ట్రాలు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాయని, అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని రాచరిక రాష్ట్రాలు భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని, ఒకే దేశంగా ఉండాలని నిర్ణయించి విలీన ప్రక్రియను వేగవంతం చేశారన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రయత్నం, పట్టుదల కారణంగానే అఖండ భారతదేశం సాధ్యమైందని గవర్నర్ చెప్పారు.  స్వతంత్రంగా ఉండాలని కోరుకున్న 558 రాచరిక రాష్ట్రాలు భారతదేశంలో విలీనం అయ్యాయని,  లేకపోతే ఈ రోజు మనం సువిశాల భారత దేశాన్ని చూడలేక పోయేవారమని హరి చందన్ అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం యొక్క ఐక్యత, సమగ్రతకు గొప్ప కృషి చేశారని, ఆయనను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల పట్టికలో ఆంధ్రప్రదేశ్‌ది ఎన్నో స్థానం?