ఆ ఐదు సాఫ్ట్ డ్రింక్‌ల్లో విష పదార్థాలున్నాయ్.. డీటీఏబీ స్టడీ.. నిజం లేదన్న కంపెనీలు
కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి అనర్థాలే ఎక్కువని పరిశోధనలో వెల్లడైంది. తాజాగా పెప్సికో, కోకాకోలా వంటి సంస్థలు తయారు చేసే సాఫ్ట్ డ్రింకుల్లో విష పదార్థాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించ
కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి అనర్థాలే ఎక్కువని పరిశోధనలో వెల్లడైంది. తాజాగా పెప్సికో, కోకాకోలా వంటి సంస్థలు తయారు చేసే సాఫ్ట్ డ్రింకుల్లో విష పదార్థాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరిశీలనలో తేలింది. అయితే తమ పెట్‌బాటిల్స్‌లో అలాంటివి ఏమీ లేవని రెండు కంపెనీలు ఖండించాయి. తమకు ప్రభుత్వం నుంచి అలాంటి నివేదిక ఏదీ రాలేదంటున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) నిర్వహించిన పరీక్షలలో.. పెప్సీ, కోకాకోలా, మౌంటెన్ డ్యూ, స్ప్రైట్, 7అప్ లాంటి కూల్ డ్రింకుల బాటిల్స్‌లో యాంటిమోనీ, సీసీ, క్రోమియం, కాడ్మియంతో పాటు డైఫ్తాలేట్ కూడా ఉన్నాయని తేలింది. అయితే ఈ ఆరోపణలను ఖండించాయి. తమకు ఈ పరీక్షల నివేదికలకు సంబంధించిన సమాచారం ఏమీ ఇంతవరకు రాలేదని పెప్సికో ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.
తమ ప్రభుత్వ శాఖల నుంచి నోటీసులు గానీ, సమాచారం గానీ కూడా ఏమీ లేదని కోకాకోలా ప్రతినిధి అన్నారు. భారతదేశంలోని ఆహార భద్రతా ప్రమాణాలు అనుమతించిన స్థాయిలో మాత్రమే తమ కూల్‌డ్రింకులలో భారలోహాలు ఉంటాయని పెప్సికో తెలిపింది.