ఆ బిడ్డకు వందేళ్ళు ప్రాణం పోశారు
అందరి రాతను బ్రహ్మే రాస్తాడు.. కానీ నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి అన్న సూక్తిని ఆ తల్లిదండ్రుల సంకల్పం నిజం చేసింది. పుట్టిన పసికందుకు తీరని కష్టం ఎదురైతే కాపాడాల్సిన తల్లిదండ్రులు తమ నిస్సహాయతను వెళ్లబుచ్చుకున్నారు. పాపను బతికించుకోవడం తమ వల్ల కావడ
అందరి రాతను బ్రహ్మే రాస్తాడు.. కానీ నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి అన్న సూక్తిని ఆ తల్లిదండ్రుల సంకల్పం నిజం చేసింది. పుట్టిన పసికందుకు తీరని కష్టం ఎదురైతే కాపాడాల్సిన తల్లిదండ్రులు తమ నిస్సహాయతను వెళ్లబుచ్చుకున్నారు. పాపను బతికించుకోవడం తమ వల్ల కావడం లేదంటూ కోర్టు మెట్లక్కారు. పాప అనారోగ్యానికి అయ్యే ఖర్చు తాము భరించలేమంటూ ఆర్థిక సమస్యల వల్ల తాము తమ పాపను కాపాడుకోలేని స్థితిలో ఉన్నట్లు విన్నవించుకున్నారు.
అయితే సమాజంలో ఇంకా మంచి మిగిలే ఉంది అంటూ నిరూపించారు ఈ జ్ఞానసాయి విషయంలో. ప్రభుత్వం చొరవ తీసుకుని పాపకు పునర్జన్మను ప్రసాదించింది. నిండు ఆరోగ్యంతో తన మొదటి పుట్టినరోజును జరుపుకున్న జ్ఞానసాయి కళ్ళలో ఆనందానికి అవధుల్లేవు. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన ప్రభుత్వానికి కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
మానవత్వానికి మచ్చుతునకగా నిలిచిన సంఘటన అది. విధికి ఎదురీది పునర్జన్మను పొందిన ఒక జ్ఞానజ్యోతి కథ ఇది. కాపాడుకోలేని తల్లిదండ్రులు తమ పాపను చంపుకోవడానికి అనుమతినివ్వాలంటూ కోర్టును ఆశ్రయిస్తే వారి నిస్సహాయతకు అండగా నిలిచింది ఈ సమాజం. ప్రభుత్వం దగ్గరుండి ఆ పాపకు ప్రాణం పోసింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేమూరిపేటకు చెందిన రమణప్ప, సరస్వతిలకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందంటూ మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. పుట్టిన ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉండగా అంతలోనే వూహించని కష్టం పిడుగై పడింది.
బిడ్డకు కాలేయ సమస్య ఉందని, బతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో గుండెలు బాదుకున్నారు ఆ తల్లిదండ్రులు. వైద్యం చేయించడానికి లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి ఇక తమ పాపను ఏ విధంగాను బతికించుకోలేమని డిసైడ్ అయ్యారు. అందుకు తమ పాప చనిపోవడానికి అనుమతినివ్వాలంటూ మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. దీంతో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పట్ల ఎంతోమంది స్పందించారు. ప్రభుత్వం కూడా దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పాపకు వైద్యం చేయించడానికి ముందుకు వచ్చింది.
చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో పాప తండ్రి యొక్క కాలేయాన్ని పాపకు అమర్చి తనకు తిరిగి ప్రాణం పోశారు డాక్టర్లు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకున్న ఆ తల్లిదండ్రులు ఈ సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన మీడియా వారి సమక్షంలోనే జ్ఞానసాయి తన మొదటి పుట్టినరోజు జరుపుకుంది. ఆ సంఘటనను చూసిన తల్లిదండ్రులతో పాటు అక్కడి జర్నలిస్టులు ఉద్వేగానికి లోనయ్యారు. ఒక తెలియని సంతృప్తిని పొందారు.