Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసంచారం లేని ప్రదేశాలకు వెళ్లొద్దని ఆడపిల్లలకు చెప్పాలి

Advertiesment
జనసంచారం లేని ప్రదేశాలకు వెళ్లొద్దని ఆడపిల్లలకు చెప్పాలి
, శుక్రవారం, 25 జూన్ 2021 (16:27 IST)
గుంటూరు అర్బన్ ఎస్పీ గారు శ్రీ అరీఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు మొన్న తాడేపల్లిలో మహిళపై జరిగిన అత్యాచార సంఘటన దృష్ట్యా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో స్పెషల్ పార్టీ పోలీసులను కొన్ని టీమ్‌లుగా ఏర్పాటు చేసి జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలలో మహిళల భద్రత దృష్ట్యా విస్తృతముగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. గుంటూరు అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ... పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడం శ్రేయస్కరం కాదని తమ పిల్లలకు తెలియ జేయాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దిశా వాహనం తిరుగుతూ ఉంటుంది, అవసర సమయంలో దిశా మహిళా పోలీస్ సిబ్బంది సహాయం పొందవచ్చని, మహిళలందరు పోలీసులు దిశా చట్టం గురించి మరియు దిశా యాప్ గురించి ప్రతి ఒక్క మహిళలకు కు పూర్తి అవగాహన కల్పించాలని తెలియజేశారు.

ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా దిశా యాప్ ద్వారా సహాయం కోరిన వెంటనే సంబంధిత అధికారులు సదరు ప్రదేశానికి వెంటనే చేరుకొని సహాయం చేయాలనీ ఆదేశించారు. మహిళలు అందరూ దిశా యాప్‌ను install చేసుకొని వారికి దగ్గరలో గల మహిళా పోలీస్ స్టేషన్‌కి విషయం తెలియపరచి సంబంధిత దిశా పోలీస్ అధికారు ద్వారా న్యాయం పొందవలసినదిగా తెలియచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వస్థలానికి రైలులో బయల్దేరిన రాష్ట్రపతి.. 15ఏళ్ల తర్వాత ట్రైన్ జర్నీ