Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనకోడలిపై మేనమాన లైంగిక దాడి.. తోటి విద్యార్థినిపై బాలుడి వేధింపులు.. ఎక్కడ?

బాలికలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో మేనమాన తన మేనకోడల్ని లైంగికంగా వేధించాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారిపై అదే కాలనీకి చెందిన వరుసకు మేన

Advertiesment
Girl harrased by uncle in guntur
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (09:46 IST)
బాలికలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో మేనమాన తన మేనకోడల్ని లైంగికంగా వేధించాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారిపై అదే కాలనీకి చెందిన వరుసకు మేనమామ అయిన తెలగతోటి సుబ్బయ్య(29) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు.

తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటయ్య తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి పంపినట్లు తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 13 ఏళ్ల బాలుడు.. ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎల్‌బీనగర్‌లోని ఓ బస్తీకి చెందిన దంపతులు రోజుకూలీలు. వీరి కుమార్తె (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. కూలీ పనికి బాలిక తల్లిదండ్రులు వెళ్ళిపోవడంతో పాటు బోనాల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.

మధ్యాహ్నం సమయంలో తోటి విద్యార్థి అయిన 13 ఏళ్ల బాలుడు ఆమె వద్దకు వచ్చి.. ఆడుకుందాం అంటూ బయటకు తీసుకెళ్లాడు. ఆ తరువాత.. వర్షం వస్తోందంటూ తన ఇంట్లోకి తీసుకువెళ్లి మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కదా అని పిల్లనిచ్చి పెళ్లిచేస్తే... ఆడపిల్ల పుట్టిందనీ అవహేళన చేశారు!