Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ దృశ్యాలన్నీ మార్ఫింగ్... నిర్దోషిగా బయటకొస్తా : గజల్ శ్రీనివాస్

తాను ఏ తప్పూ చేయలేదనీ, ఏ ఒక్క అమ్మాయిని లైంగికంగా వేధించలేదనీ ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పైగా, తనకు సంబంధించి మీడియాలో ప్రసారమైన సీసీటీవీ దృశ్యాలన్నీ మార్ఫింగ్స్ అని ఆయన చెప్ప

Advertiesment
ఆ దృశ్యాలన్నీ మార్ఫింగ్... నిర్దోషిగా బయటకొస్తా : గజల్ శ్రీనివాస్
, గురువారం, 25 జనవరి 2018 (09:51 IST)
తాను ఏ తప్పూ చేయలేదనీ, ఏ ఒక్క అమ్మాయిని లైంగికంగా వేధించలేదనీ ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పైగా, తనకు సంబంధించి మీడియాలో ప్రసారమైన సీసీటీవీ దృశ్యాలన్నీ మార్ఫింగ్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఆకాశవాణి వెబ్ రేడియోలో పని చేసే ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టు అయిన గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 
 
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు విషయం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున తానేమీ మాట్లాడనని, నిర్దోషిగా బయటకొస్తానని చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వని గజల్, పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చుని.. అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. 
 
కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ ఈరోజు మంజూరైంది. రూ.10 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలని, వారంలో రెండు సార్లు (ప్రతి బుధ, ఆది వారాలు) పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ ముందు నిందితుడు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్తను చంపేశారు...