వైఎస్ఆర్ ముక్కుసూటి మనిషి.. మరి చంద్రబాబు : ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల వ్యక్తిత్వం గురించి టాలీవుడ్ నిర్మాత జి. ఆదిశేషగిరిరావు తన మనసులోని మాటను వెల్లడించారు. వైఎస్ఆర్ ముక్కుసూటి మనిషి అని వ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల వ్యక్తిత్వం గురించి టాలీవుడ్ నిర్మాత జి. ఆదిశేషగిరిరావు తన మనసులోని మాటను వెల్లడించారు. వైఎస్ఆర్ ముక్కుసూటి మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన... తనను నమ్మినవాళ్లను ఆదుకోవడం వైకాపా అలవాటని సీనియర్ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు అన్నారు.
ఇకపోతే... ఏ విషయంలోనైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముక్కుసూటిగా వెళతారన్నారు. అదే, చంద్రబాబు నాయుడు వ్యూహకర్త అని, కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తారన్నారు. తనను నమ్మినవాళ్లను నష్టపరిచి అయినా సరే, అనుకున్నది సాధించడమనేది ఆయనకు కావాలని అన్నారు. అందుకు నిదర్శనమన్నారు.
కానీ చంద్రబాబు మనస్తత్వం మరోలా ఉంటుందన్నారు. గతంలో చంద్రబాబు సీఎం కావడానికి కారకులైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ... వంటి వాళ్లను దూరంగా పెట్టడమేనని అన్నారు. అడ్డమైన హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆదిశేషగిరిరావు విమర్శించారు.