Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్‌లో దారుణం : మతిస్థిమితం లేని వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్

వైజాగ్‌లో దారుణం జరిగింది. అనాథగా జీవిస్తూ మతిస్థిమితం లేకుండా ఉన్న ఓ వృద్ధురాలిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కీచకపర్వం విశాఖలోని పూర్ణా మార్కెట్ చేపల బజార్‌లో జరిగింది. తాజ

వైజాగ్‌లో దారుణం : మతిస్థిమితం లేని వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్
, మంగళవారం, 17 జనవరి 2017 (12:38 IST)
వైజాగ్‌లో దారుణం జరిగింది. అనాథగా జీవిస్తూ మతిస్థిమితం లేకుండా ఉన్న ఓ వృద్ధురాలిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కీచకపర్వం విశాఖలోని పూర్ణా మార్కెట్ చేపల బజార్‌లో జరిగింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ బజార్‌లోని ఓ దుకాణం వద్ద 55 యేళ్ల వృద్ధురాలు గత 15 యేళ్లుగా జీవిస్తోంది. అనాథ కావడంతో మార్కెట్ వ్యాపారులు కూడా ఆ వృద్ధురాలిని చేరదీసి అన్నపానీయాలు అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మద్యం సేవించిన ముగ్గురు నలుగురు కామాంధులు... మార్కెట్‌లో దుకాణం బయట నిద్రిస్తున్న ఆ మహిళపై సోమవారం తెల్లవారుజామున సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమై, నోప్పిని భరించలేక బిగ్గరగా అరుస్తుంటే.. ఆ కీచకులు ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ముఖం, కళ్లు, ముక్కు, పెదాలు కమిలిపోయి బాగా వాచిపోయాయి. ఈ దెబ్బలకు తాళలేక ఆ మహిళ అపస్మారక స్థితిలోకి జారుకుంది. సోమవారం ఉదయం మార్కెట్‌కు వెళ్లిన కొందరు వ్యాపారులు.. రక్తపు మడుగులో పడివున్న ఆ మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. అలాగే, అత్యాచారానికి పాల్పడిన కామాంధులు గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా మార్కెట్ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి అర్థరాత్రి డ్యాన్సర్లతో ఎంపీ మాగంటి బాబు డాష్.. డాష్..