Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకాశం బ్యారేజ్ వద్ద గ్యాంగ్ రేప్, ఆ ఘటన నా మనసును కలచివేసిందన్న జగన్

Advertiesment
gang rape
, మంగళవారం, 22 జూన్ 2021 (16:36 IST)
ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ... ''ఈ ఘటన కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగింది.
 
ఇది నా మనసును చాలా కలిచి వేసింది. దీనికి చాలా చింతిస్తున్నాను, ఇలాంటి ఘటనలు ఎక్కడా జరక్కూడదు. మహిళలు అర్థరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని. ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతాను'' అన్నారు జగన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పుడు సర్టిఫికేట్ కేసులో ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీం ఊరట