Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ ఆ ఒక్క పనిచేయలేదు.. కానీ బాబు చేసేశారు.. పులివెందులలో జగన్‌కు కష్టమేనా?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వల్ల కానిది.. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుచే అయ్యందని టీడీపీ ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు అంటున్నారు. అదేంటో తెలుసా? చదవండి మరి.. పులివెందుల అంటే అందరికీ

Advertiesment
gali muddu krishnama naidu comments on YSR
, సోమవారం, 26 డిశెంబరు 2016 (13:33 IST)
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వల్ల కానిది.. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుచే అయ్యందని టీడీపీ ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు అంటున్నారు. అదేంటో తెలుసా? చదవండి మరి.. పులివెందుల అంటే అందరికీ గుర్తొచ్చేది వైఎస్సార్. ఈ నియోజకవర్గం ద్వారానే గాలి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్సార్ తర్వాత ఆయన కుమారుడు జగన్ ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 
 
జగన్‌ కూడా ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం కూడా వైఎస్సార్ ఎన్నో పనులు చేశారు. కానీ నీరు మాత్రం తేలేకపోయారు. వైఎస్సార్ ఎన్నో సంవత్సరాలుగా చేయలేని ఆ పనిని చంద్రబాబు రెండేళ్లలోనే పూర్తి చేశారని గాలి అంటున్నారు. 
 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏడు సంవత్సరాలు పరిపాలించినా పులివెందులకు నీరు తీసుకురాలేకపోయారని... ఇది చాలా దురదృష్టకరమని గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో టీడీపీకి ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా కోట్ల రూపాయల ఖర్చు చేసి పులివెందుల నియోజకవర్గానికి సాగు, తాగు నీరు తీసుకు వచ్చిన ఘనత సీఎం చంద్రబాబునాయుడికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే గండికోటకు కావలసినంత నీరు తీసువచ్చామని వచ్చే నెల నుంచి నీరు ఇచ్చే సమయంలో జగన్‌ పులివెందులలో ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఎక్కడ అభివృద్ది జరిగితే అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం.. దీక్షలు చేపట్టడం జగన్‌కు పరిపాటిపారిందని గాలి మండిపడుతున్నారు. జగన్‌ ఇప్పటికైనా మారి రాష్ట్రాభివృద్దికి సహకరించాలంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో వేధింపులు.. వ్యక్తి సూసైడ్.. భార్యను రైలు పట్టాల మీద నుంచి పక్కకు తోసేశాడు..