రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 18.35 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందివ్వనున్నట్టు విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
మరోవైపు, ఏపీ రాష్ట్రంలో రైతులకు శుభవార్త అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని 18.35 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. యూనిట్ విద్యుత్‌ను రూ.4.46 లకు కొని రైతులకు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు.
త్వరలోనే సోలార్ విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాని కోసం పది వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని టెండర్ల ద్వారా రూ.2.49లకు కొనుగోలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.