కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన స్క్రార్పియో.. నలుగురు యువకుల మృతి
షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ
షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో వాహనంలో ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్నారు.
కొత్తకోట వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108లో క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి దారితీసిందని పోలీసులు చెప్తున్నారు.