వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి, వైకాపా ఎంపీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చన్నారు. బహుశా తన భార్య శశీదేవికి టిక్కెట్ ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు.
"నీకు సీటు లేదు.. నీ భార్యకు ఇస్తాం" అంటే చేసేదేమీ లేదని అన్నారు. మహిళలకు టిక్కెట్ ఇస్తున్నపుడు నేనైనా తప్పుకోవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. కొండపి నియోజకవర్గంలో అశోక్ బాబు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని స్పష్టం చేశారు.