Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపాలో చేరనున్న ఉండవల్లి అరుణ్ కుమార్?

కాంగ్రెస్ మాజీ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరనున్నట్టు సమాచారం. అందుకే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నట్ట

వైకాపాలో చేరనున్న ఉండవల్లి అరుణ్ కుమార్?
, మంగళవారం, 15 ఆగస్టు 2017 (15:20 IST)
కాంగ్రెస్ మాజీ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరనున్నట్టు సమాచారం. అందుకే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉండవల్లి కాంగ్రెస్‌ పార్టీలో తనదైనముద్ర వేసుకున్నారు. రాజీవ్‌, సోనియా గాంధీల ప్రసంగాలను చక్కటి తెలుగులో అనువదిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఎదిగారు. రాజమండ్రి లోక్‌సభ సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 
 
కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు వల్లే ఏపీలో ఆ పార్టీ భూస్థాపితమయ్యిందంటూ కుండబద్దలు కొట్టరాయన! విభజన సమయంలో అధిష్టానాన్ని ధిక్కరించి ఏపీ ప్రజల దృష్టిలో హీరో అయ్యారు. సమైకాంధ్ర ఉద్యమ సమయంలో ఉండవల్లి ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా వినేవారు. మాటల మాంత్రికుడిగా, రాజకీయ విశ్లేషణలు చేయటంలో పట్టున్న వ్యక్తిగా పేరుతెచ్చుకున్న ఉండవల్లి కాంగ్రెస్ నుంచి బయటపడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి జై కొట్టారు. ఆ పార్టీ కాస్తా ఎన్నికల్లో తుస్సుమనిపించింది.. అటు పిమ్మట ఉండవల్లి రాజకీయాలకు దూరమయ్యారు. ఇపుడు రాష్ట్రంలో బలమైన విపక్ష పార్టీగా ఉన్న వైకాపాలో అరుణ్ కుమార్ చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి - ముఖ్యమంత్రి చంద్రబాబు