Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అటవీశాఖామంత్రిగా నారా లోకేష్‌..? బొజ్జల పదవి అనుమానమే..!

ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అనుకున్నదే చేస్తున్నారు. తన కుమారుడిని ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలనుకుని ఎదురుచూస్తున్న బాబుకు చివరకు అవకాశం వచ్చింది. త్వరలో ఎమ్మెల్సీల నియామకం ఉండడంతో అందులో నారా లోకేష్‌ను చేర్చి మంత్రి పదవి ఇవ్వాలన్

అటవీశాఖామంత్రిగా నారా లోకేష్‌..? బొజ్జల పదవి అనుమానమే..!
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (13:45 IST)
ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అనుకున్నదే చేస్తున్నారు. తన కుమారుడిని ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలనుకుని ఎదురుచూస్తున్న బాబుకు చివరకు అవకాశం వచ్చింది. త్వరలో ఎమ్మెల్సీల నియామకం ఉండడంతో అందులో నారా లోకేష్‌ను చేర్చి మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది మంత్రులు, సీనియర్ నేతలు మాత్రం నారా లోకేష్‌కు తెలంగాణ ప్రాంత బాధ్యతలు అప్పగిస్తాం. ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ తెలంగాణ ప్రాంతంలో గట్టిగా లేదు కాబట్టి ఆ బాధ్యతలు అప్పజెబితే పార్టీ పటిష్టంగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. 
 
అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను మాటలను పక్కనబెట్టేశారట చంద్రబాబు. తన సొంత జిల్లా చిత్తూరుకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఇప్పటివరకు అటవీశాఖామంత్రిగా ఉన్న బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. ప్రస్తుతం బొజ్జలను అదే పదవిలో కొనసాగించాలా లేకుంటే వేరే ఏదైనా శాఖ ఇవ్వాలా అన్న ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.
 
నారా లోకేష్‌‌ను చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఇవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి తన సొంత జిల్లా కావడం. పార్టీని మరింత పటిష్టం చేయాలన్న ఆలోచన. ఇలా ఒకటేమిటి. ఎన్నో చేయాలన్న ఆలోచనలో నారా లోకేష్‌కు అటవీశాఖామంత్రిగా ఇవ్వడానికి దాదాపు బాబు సిద్ధమై పోయారట. శేషాచలం అడవుల్లోని అరుదైన ఎర్రచందనాన్ని కాపాడేందుకు నారా లోకేష్‌ సరిపోతారన్నది బాబు అభిప్రాయంగా వున్నట్లు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ సీక్రెంట్ ఏంటంటే? వ్యాయామం + డ్రగ్స్ తీసుకోవడమే