గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోమారు తలపడ్డారు. ఫ్లెక్లీల ఏర్పాటుపై చెలరేగిన వివాదం కాస్త పెద్దదై ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదికానుందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.
నిజానికి ఈ ఫ్లెక్సీల వివాదం మాచెర్ల నియోజకవర్గంలో జరిగింది. ఇది క్రమక్రమంగా విస్తరించి నర్సారావు పేట నియోజవకవర్గానికి వ్యాపించింది. మాచర్ల ఇంచార్జ్‌గా బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత మాచర్లలో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే, అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలే చింపివేశారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ తర్వాత నర్సారావు పేట మండలం కేశానుపల్లిలో టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమయ్యారు. దీంతో పోలీసులు గట్టి భద్రతను కల్పించారు.