Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

Advertiesment
Jagan_Bharathi

సెల్వి

, బుధవారం, 22 అక్టోబరు 2025 (10:57 IST)
Jagan_Bharathi
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన నుండి బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బెంగళూరులోని యెలహంకలోని తన విలాసవంతమైన ఇంట్లో దీపావళి పండుగను జరుపుకున్నారు. తొలిసారిగా జగన్ తన భార్య భారతితో కలిసి దీపావళి పండుగను బహిరంగంగా జరుపుకున్నారు.
 
ఇంతకుముందు ఎన్నడూ జగన్ ఇలా దీపావళి జరుపుకున్న దాఖలాలు లేవు. జగన్ బహిరంగంగా దీపావళిని జరుపుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జగన్, భార్య భారతి దీపావళి పండుగను జరుపుకుంటున్న దృశ్యాలను వైకాపా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్‌ చేశారు. 
 
అయితే క్రాకర్స్‌ కాల్చే సమయంలో ఆయన ధరించిన షూ గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుంది. దీంతో అందని దృష్టి ఆయన ధరించే షూ పైనే పడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంతకు ఆయన వేసుకున్న షూ ఏంటి, వాటి ధర ఎంత ఉంటుందో అనే ఆలోచనలో పడ్డారు. 
webdunia
Jagan Diwali
 
ఇదొక రన్నింగ్ షూ తయారు చేసే ప్రముఖ బ్రాండ్. మాజీ సీఎం జగన్ ధరించిన షూ ఖరీదు రూ.10,999గా ఉండగా.. డిస్కౌంట్‌లో అది రూ. 8,799కి అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో నారా లోకేష్ డీల్