Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీలియోన్ అర్ధనగ్న ఫోటోలను రైతులు అలా ఉపయోగిస్తున్నారట?

నరదిష్టి నుంచి పంట పొలాలను కాపాడేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ ఫోటోలను పొలం వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఫోటోను ఏర్పాటు చేయడం ద్వారా దారినపోయే వారి దృష్టిని పంట పొలాలపై

Advertiesment
సన్నీలియోన్ అర్ధనగ్న ఫోటోలను రైతులు అలా ఉపయోగిస్తున్నారట?
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:15 IST)
నరదిష్టి నుంచి పంట పొలాలను కాపాడేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ ఫోటోలను పొలం వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఫోటోను ఏర్పాటు చేయడం ద్వారా దారినపోయే వారి దృష్టిని పంట పొలాలపై కాకుండా.. ఆ ఫోటోలపై మరల్చుతున్నారు. తద్వారా పంట పొలాలపై నరదిష్టిని దూరం చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు ఈ కొత్త ఐడియాను అమలు పరుస్తున్నారు. బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండటంతో దారిపోయే వారు అటువైపు చూడకుండా వుండలేకపోతున్నారు. 
 
ఇలా బాటసారుల దిష్టి పచ్చని పంట పొలాలపై పడుతుండటం ద్వారా దిగుబడి తగ్గిపోతుందని భావించిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లీంచేందుకు పొలం గట్లపై సన్నీ లియోన్ అర్ధనగ్న పటాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌లో అది నచ్చింది.. నిజమైన రాజకీయాలు?: ఉండవల్లి