Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొగాకును ప్రత్యామ్నాయ పంటలతో భర్తీ చేయాలనే WHO సిఫార్సును ప్రశ్నిస్తున్న రైతు సంఘాలు

image
, బుధవారం, 31 మే 2023 (22:20 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలో వాణిజ్య పంటలు పండించే మిలియన్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (FAIFA), పొగాకు పంటలు పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నందున, ప్రపంచ ఆహార సంక్షోభానికి దోహదపడుతున్నందున వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే దాని సిఫార్సుపై సాక్ష్యాలను అందించమని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ)ని నేడు సవాలు చేసింది.

WHO యొక్క అశాస్త్రీయ సిఫార్సుపై దర్యాప్తు ప్రారంభించాలని ఫైఫా, PMO (ప్రధాన మంత్రి కార్యాలయం), ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలను కూడా కోరింది. స్వార్థ ప్రయోజనాలతో కొన్ని సంస్థలు, పొగాకు సాగు స్థానంలో ఇతర పంటల ప్రయోజనాలను (తప్పుగా మార్చిన) ప్రచారం చేస్తున్నాయని ఫైఫా నొక్కి చెప్పింది.
 
అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఎఫ్‌ఏ) అధ్యక్షుడు జవరే గౌడ, మాట్లాడుతూ, “WHO అధికారులు ఇలాంటి అశాస్త్రీయ ప్రకటనలు లేదా సిఫార్సులు చేయకూడదు.  పొగాకు పంటలకు  సమానమైన లాభదాయకమైన మరియు దృఢమైన ప్రత్యామ్నాయ పంటలను అందించాల్సిందిగా మేము వారిని సవాలు చేస్తున్నాము. విఫలమైతే దేశంలోని తమ కార్యాలయాలను మూసివేసి వెళ్లిపోవాలి. రైతులకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నందున ఇది మా న్యాయమైన డిమాండ్" అని అన్నారు.
 
మురళీబాబు, జనరల్ సెక్రటరీ, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఐఎఫ్‌ఎ) మాట్లాడుతూ, “మన పొగాకు రైతులను పొగాకు స్థానంలో ఇతర పంటలను సాగుచేయమని  WHO సిఫార్సు చేయటంతో జీవనోపాధి నాశనం అవుతుంది. గతంలో వారి ప్రయోగాలు మన పొగాకు రైతులకు భారీ నష్టాలను కలిగించాయి. వ్యవసాయ సమాజానికి సహాయం చేయాలనే వారి నిజమైన ఉద్దేశాన్ని ప్రదర్శించాలని WHOకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరియు పొగాకు రైతులకు సంభవించే ఏదైనా నష్టానికి వారు పూర్తి నష్టపరిహారానికి హామీ ఇవ్వాలి. వారి ఉద్దేశాన్ని చూపించి, పొగాకు బోర్డులో కనీసం రూ. 1000 కోట్లు డిపాజిట్ చేయాలని మేము వారిని అభ్యర్థిస్తున్నాము. ఈ సిఫార్సుల వల్ల విదేశీ మారక ద్రవ్యంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లుతుందని పరిగణనలోకి తీసుకుని, భారత ప్రభుత్వం ఈ సిఫారసులపై విచారణ జరపాలి” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాబా నిద్రించిన పాపానికి కూతురిని 25సార్లు కత్తితో పొడిచాడు..