Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షిరిడీలో విఠల్ రావు అదృశ్యం: కుటుంబంతో సహా ఎక్కడికెళ్లారు?

Advertiesment
Famous Ghazal Singer Vithal Rao Missing In Shirdi
, మంగళవారం, 9 జూన్ 2015 (11:26 IST)
హైదరాబాద్‌కు చెందిన గజల్ గాయకుడు విఠల్ రావు పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడీలో అదృశ్యమయ్యారు. హైదరాబాద్‌లోని గోషా మహల్‌లో నివసించే విఠల్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి గత నెల షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లారు.

గత నెల 29న ఆయన సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆచూకీ గల్లంతైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో షిరిడీ పోలీసులు విఠల్ రావు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 
 
ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా విఠల్ రావుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విఠల్ రావు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి కుటుంబంతో సహా ఎక్కడికెళ్లారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu