Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కృష్ణలంక రిటైనింగ్ వాల్ (Video)

krishnalanka retaining wall

ఠాగూర్

, శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:17 IST)
ప్రకాశం బ్యారేజి దగ్గర ఎప్పుడు గేట్లు వదిలినా, విజయవాడ కనకదుర్గ వారధి వద్ద నుంచి కృష్ణలంక, రామలింగేశ్వనగర్‌ తదితర ప్రాంతాలు, వరద ముంపుకి గురి అయ్యేవి. దీంతో రీటైనింగ్ వాల్ నిర్మిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. 2014 ముందు నుంచి దాదాపుగా దశాబ్ద కాలం పాటు, ఈ రిటైనింగ్ వాల్ కోసం పోరాటాలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత దివంగత ఎర్రంనాయుడు జీవించివున్న సమయంలో ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలతో కలిసి, టిడిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
 
విజయవాడ నగరంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాదాపుగా 20 వేల కుటుంబాలు ఉన్నాయి. 70 నుంచి 80 వేల మంది ప్రజల చిరకాల స్వప్నం ఈ రిటైనింగ్ వాల్.. 2014 ఎన్నికల్లో, మేము రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం అనే హామీతో, టిడిపి ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలు గెలిపించారు. హామీ ఇచ్చినట్టే కృష్ణలంక రిటైనింగ్ వాల్ పనులు మొదలు పెట్టింది నాటి టిడిపి ప్రభుత్వం 90 శాతం మేరకు పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మిగిలిన 10 శాతం పూర్తి చేసింది. కానీ, ఇపుడు వైకాపా పాలకులు ఈ రిటైనింగ్ వాల్‌ను తామే పూర్తి చేశామంటూ ఊదరగొట్టుడు ప్రచారం చేసుకుంటున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌- భట్టి విక్రమార్క ప్రకటన