మే 28వ తేదీ టీటీడీ కల్యాణమస్తు సామూహిక వివాహలను నిర్వహించనున్న విషయం విదితమే. ఆసక్తి గల అవివాహితులైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రధాన నగరాలతో పాటు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తు పత్రములు www.tirumala.org నుండి కానీ, ఆయా జిల్లాల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్స్ నుండి పొందవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆయా జిల్లా కేంద్రాలల్లోని కల్యాణ మండపాల కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.
ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై వేంచేపు చేసి, మిథున లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా రాత్రి 8 గంటలకు ఆలయంలో పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాతంగా వాహనసేవ జరుగనుంది.
27-04-2021 చిన్నశేష వాహనం హంస వాహనం
28-04-2021 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
29-04-2021 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
30-04-2021 మోహినీ అవతారం గరుడ వాహనం
01-05-2021 హనుమంత వాహనం గజ వాహనం
02-05-2021 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-05-2021 సర్వభూపాల వాహనం ఆర్జితకల్యాణోత్సవం/అశ్వవాహనం
04-05-2021 చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 3వ తేదీన సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం ఆలయంలో ఏకాంతంగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజ బట్టర్, కంకణ బట్టర్ సాయిక్రిష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నందకుమార్, ఉదయ్‌కుమార్‌ఇతర అధికారులు పాల్గొన్నారు.